*మన కొలనుకొండ గ్రామంలో వేంచేసియున్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం నందు ప్రతి మాసములో జరుగు కార్యక్రమాల వివరాలు* 1. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి మరియు శ్రీ అభయ ఆంజనేయస్వామి వారికి పంచామృత అభిషేకం అనంతరము అర్చనలు జరుగును. సాయంత్రం ఏడు గంటలకు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరుగును. 2. ప్రతి బుధవారం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి మరియు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి పంచామృత అభిషేకం అనంతరము అర్చనలు జరుగును. 3. ప్రతి శుక్రవారం శ్రీ మాలికాపురత్తమ్మ అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకం అనంతరము అర్చనలు మరియు సాయంత్రం లలిత సహస్ర నామ పారాయణం జరుగును. 4. ప్రతి పౌర్ణమికి సాయంత్రం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము సామూహికముగా జరుగును. 5. ప్రతి ఏకాదశి సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం జరుగును. 6. బహుళ చతుర్ధి అనగా సంకటహార చతుర్ధి నాడు ఉదయం లక్ష్మీ గణపతి హోమం మరియు సాయంత్రం 5.30 గంటలకు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి అభిషేకం అనంతరము అర్చనలు జరుగును. 7. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మరియు కృత్తికా నక్షత్రం రోజు శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అనంతరము అర్చనలు జరుగును. 8. ప్రతి మాసములో వచ్చు ఉత్తర నక్షత్రం నాడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పంచామృత అభిషేకం జరుగును. 9. ఉత్తరాభాద్ర నక్షత్రం రోజు శ్రీ అభయ ఆంజనేయస్వామి వారికి పంచామృత అభిషేకం అనంతరము అర్చనలు జరుగును. 10. ప్రతి బహుళ అష్ఠమి నాడు అనగా *అనఘాష్ఠమి* సందర్భంగా శ్రీ అనఘా దేవి సమేత దత్తాత్రేయ స్వామి వారి అనఘావ్రతం సామూహికముగా చేయించడము జరుగుతుంది. 11. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మి వ్రతం సామూహికముగా చేయించడము జరుగుతుంది. ఇట్లు ఆలయ అర్చకులు & ఆలయ కమిటీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం కొలనుకొండ
27.07.2025 09:04